Chandrayan 1

15/01/2011 19:31

చందమామకు భారత్ తొలియాత్ర

చంద్రయాన్ – 1
డా " ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, అమలాపురం
 
డా " ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, అమలాపురం పున్నమి వెన్నెల్లో ఆరుబయట నిలబడి తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తే నిండు చందమామ మన దృష్టిని ఆకట్టుకుంటుంది. అబ్బ ! ఈ చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడని అబ్బురపడిపోతాం. దూరం నుంచి మనల్ని ఎంతగానో మురిపించే ఈ చందమామను దగ్గరగా చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అంతే కాదు సాక్షాత్తు ఆ చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ దిగి విహరిస్తూ అక్కడ విశేషాలను కళ్ళారా చూస్తే ఎలా ఉంటుంది? అనిపిస్తుంది. నిజంగా ఈ ఆలోచన ఈనాటిదికాదు. ఈ భూమి మీద మానవ చరిత్ర ఆరంభం నుంచి చందమామ మనుషుల్ని మురిపిస్తూనే ఉన్నాడు.

ఎంతోమంది కవులు,రచయితలు చందమామ చుట్టూ ఎన్నో కథలు అల్లారు. పాటలు, గేయాలు రాశారు. కొన్ని దేశాల్లో చంద్ర కళలు ఆధారంగా క్యాలెండర్ ను తయారు చేశారు. 'చందమామ రావే జాబిల్లి రావే' పాటను వినని వాళ్ళు మనలో ఎవరుంటారు?

అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇప్పటికే మనదేశం ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. ఈ రంగంలో మరింత ముందుకు పోయేందుకు తనదైన ముద్ర వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రుడి మీదకి దృష్టి మరల్చింది. చంద్రుణ్ణి చాలా దగ్గరగా పరిశీలించేందుకు మనదేశం తొలిసారిగా మనుషులు లేని ఒక ఉపగ్రహాన్ని పంపిస్తోంది. దీని పేరు చంద్రయాన్ -1 2008 సంవత్సరం ఏప్రిల్ 9న శ్రీహరికోటలోని సతీష్‌ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించేందుకు భారత అంతరిక్షపరిశోధనకేంద్రం (ఇస్రో) ఏర్పాట్లు చేస్తుంది. పి.యస్.ఎల్.వి. వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ నిర్ధిష్టకక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఈ కక్ష్య ఉంటుంది. అత్యంత ఆధునికమైన శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రోజెక్టు పట్ల మొత్తం దేశం యావత్తు ఆసక్తితో ఎదురు చూస్తోంది.

భూమి నుంచి ప్రయోగించే సమయంలో చంద్రయాన్ - 1 బరువు 1100కి.గ్రా. ఉంటుంది. కాని ఆ తర్వాత దానిలోని ఇంధనం ఖర్చవడం వల్ల తుది కక్ష్యలో ఉన్నప్పుడు దాని బరువు 525 కి.గ్రా. ఉంటుంది. ఎన్నో బృహత్తరమైన లక్ష్యలతో చేపట్టిన ఈ ప్రోజెక్టు ద్వారా మన శాస్త్రవేత్తలకు ఎంతో అనుభవం వస్తుంది. భవిష్యత్లో ఇతర గ్రహాలను గురించి మనదేశం చేపట్టబోయే కార్యక్రమాలకు ఈ అనుభవం కలిసి వస్తుంది.ఈ ప్రోజెక్టుకు మొత్తం ఖర్చు దాదాపు 380 కోట్ల రూపాయలుగా అంచనావేస్తున్నారు. ప్రయోగానికి వీలుగా చంద్రయన్ - 1 ముస్తాబవుతోంది. మరో వైపునా ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.వీటిలో భాగంగా, బెంగుళూరుకు 40 కిలోమిటర్ల దూరంలోని బయలాలు గ్రామంలో 32 మీటర్ల వ్యాసం, 60 టన్నుల బరువు ఉన్న డిష్ ఆంటినాను ఈస్రో ఏర్పాటు చేసింది. చంద్రయన్ - 1 చేయాల్సిన పనులకు సంబంధించిన ఆజ్ఞలను ఈ ఆంటినా పంపిస్తుంది. అంతేకాకుండా ఉపగ్రహంలోని కెమెరాలు, ఇతర పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తెలియజేసే సంకేతాలను గ్రహిస్తుంది. వీటితోపాటు చంద్రుని గురించి చంద్రయన్ - 1 పంపించే వైజ్ఞానిక సమాచారానికి సంబంధించిన సంకేతాలను కూడా ఈ ఆంటినా గ్రహిస్తుంది.

గతంలో ఎన్నో దేశాలు చంద్రుడి గురించి ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను తెలుసుకున్నప్పటికి ఇంకా ఎన్నో విషయాలు అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఈ రహస్యాలనే కాకుండా మొత్తం సౌరకుటుంబం అంటే సూర్యుడు, సూర్యుని చూట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలు, వాటి ఉపగ్రహాల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం చంద్రయన్ -1 లక్ష్యాలలో ఒకటి. మొత్తం చంద్రుని ఉపరితలాన్ని రసాయనికంగా పరిశోధించి అక్కడ మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఇనుము, టైటానియం వంటి మూలకాలతో పాటు, రేడియం, యురేనియం, థోరియం, గడలోనియం వంటి రేడియో ధార్మికాలను గురించి అన్వేషించడం కూడా ఈ లక్ష్యాల్లో భాగమే. చంద్రుడి మీద ఘనీభవించిన స్థితిలో ఉన్న నీరు, పరిశుభ్రమైన శక్తి జనకమైన హీలియం - 3 కూడా చంద్రుని గురించిన అన్వేషణకు ప్రాధాన్యత కలిగిస్తున్నాయి.

వాతావరణం లేదు కాబట్టి చంద్రుడి మీద ఏ వస్తువైనా అతి నెమ్మదిగా కోతకు గురవుతుంది. అలాగే గుర్తులు కూడా తొందరగా చెరిగిపోవు. భూమి చంద్రుడు ఏకకాలంలో ఏర్పడ్డాయి. కాబట్టి భూమి మీద కనిపించకుండా పోయిన ప్రాచీనకాలం నాటి విశేషాలు చంద్రునిమీద పదిలంగా ఉంటాయని నమ్ముతున్నారు. అందుచేత చంద్రుని మీదికి చేసే యాత్ర అంటే భూమి గతంలోకి తొంగి చూడ్డమేనన్నమాట.

చంద్రయన్ - 1 ఉపగ్రహంలో ఎన్నో ఆధునిక పరికరాలున్నాయి. వీటిలో మన దేశానికి చెందిన 5 పరికరాలతోపాటు ఇతర దేశాలకు చెందిన ఆరు పరికరాలున్నాయి. బల్గేరియాకి చెందిన ' రాడకు – 7’ వ్యవస్థ చంద్రునిపై ఉన్న రేడియేషన్ ను కొలిచి భూమికి పంపిస్తుంది.అమెరికాకి చెందిన ' మినిసార్ ' వ్యవస్థ చంద్రుని మీద ఉన్న మంచును కనుగొంటుంది. బ్రిటన్ కు చెందిన ' హేక్స్ ' అనే వ్యవస్థ చంద్రుని మీద యురేనియం, ధోరియం వంటి రేడియో ధార్మిక మూలకాలను కనిపెడుతుంది. జర్మనీకి చెందిన ' సిర్ - 2' వ్యవస్థ చంద్రునిపై ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెడుతుంది.

చంద్రుని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడం సైన్స్ పరంగా చాలా ప్రాధాన్యత గల విషయం అందుచేతనే చాలా దేశాలు ఈ విషయంలో ఎంతో ఆసక్తినికి చూపుతున్నాయి. 2007 సంవత్సరంలో జరిగిన ప్రయోగాలే ఇందుకు నిదర్శనం. సెప్టెంబరు నెలలో జపాన్ చంద్రుడి మీదికి ఒక మానవ రహిత అంటే మనుషులు లేని అంతరిక్షనౌకను పంపించింది. దీని పేరు ' కగుయా ' అక్టోబర్ లో చైనా ' చాంగ్ ఈ -1 '

అంతరిక్ష అన్వేషక నౌకను పంపించింది. ఈ రెండూ కూడా చంద్రుడి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించి భూమి మీదికి చంద్రుని ఫోటోలతో పాటు, సమాచారాన్ని కూడా పంపిస్తున్నాయి. దక్షిణ కొరియా కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది.

కేవలం మానవరహిత నౌకల్నేకాకుండా వ్యోమగాముల్ని కూడా చంద్రుడి మీదికి పంపిచేందుకు మనదేశం, చైనా ఆలోచిస్తున్నాయి. చంద్రుని నుంచి శిలలు, మట్టి నమూనాలు భూమికి తెప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నాయి. 2010 - 11 కాలంలో చంద్రయాన్ - 2 పేరుతో ఒక ' రోవర్ ' ను చంద్రుడి మీద దింపేందుకు కలిసి పనిచేయాలని ఇండియా, రష్యా నిర్ణయించుకున్నాయి. ఇందుకుగాను ఒక ఒప్పందం మీద ఇటీవలే సంతకాలు చేశాయి. ఈ రోవర్ మోటారు సాయంతో పనిచేస్తుంది. దానికి అమర్చిన చక్రాలతో చంద్రుడి ఉపరితలం మీద కదులుతుంది. శిలలు, మట్టి నమూనాలను సేకరిస్తుంది. వీటిని అక్కడే రసాయనికంగా విశ్లేషణ చేసి దానికి సంబంధించిన వివరాలను కక్షలో పరిభ్రమిస్తున్న మాతృనౌక చంద్రయాన్ -1 కు పంపిస్తుంది. అక్కడి నుంచి ఆ సమాచారం భూమికి చేరుతుంది. ఈ రోవర్ సౌరశక్తితో పనిచేస్తూ ఒక నెల రోజుల పాటు తిరుగుతుంది. అవసరమనుకుంటే, రోవర్లోని బ్యాటరీలను రీఛార్జీ చేసి మరో రెండు మూడు నెలల పాటు దీనిలోని పరికరాలను పనిచేయిస్తారు.
నిజానికి చంద్రుడి గురించి మనిషి చేసే అన్వేషణలు ఈనాటివి కావు. 1609లో గెలీలియో తను కనుపెట్టిన టెలిస్కోపును చంద్రుడి వైపు తిప్పాడు. చంద్రుడి ఉపరితల గురించి చాలా విషయాలు తెల్సుకున్నాడు. 1959లో సోవియట్ యూనియన్ ఒక మానవరహిత నౌకను ప్రయోగించింది. దీని పేరు స్పుత్నిక్ -1 ఇది చంద్రుడి మీద దిగింది. ఆ తర్వాత ఇంకొక నౌక చంద్రుని ఆవలివైపు ఫొటోలను తీసి భూమికి పంపింది.
1960 దశకంలో అమెరికా రేంజర్, సర్వేయర్ లను కొన్ని ఇతర ఉపగహాలను ప్రయోగించింది. ఇవి కూడా చంద్రుడి ఉపరితలం ఫొటోలను తీశాయి. 1969 జూలై 20 వ తేదీన మానవచరిత్రలోనే ఒక గొప్ప సంఘటన జరిగింది. అమెరికా ప్రయోగించిన అపోలో - 11 ద్వారా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లు చంద్రుడి మీద దిగి నడిచారు. అక్కడ ఒక టెలివిజన్ కెమెరాను ఏర్పాటు చేశారు. మట్టి, శిలల నమూనాలను సేకరించారు. వీరితోపాటు ప్రయాణించిన మైకేల్ కోలిన్స్ మాత్రం చంద్రుడి చుట్టూ కక్షలో తిరుగుతున్న మాతృనౌక కొలంబియాలోనే ఉండిపోయాడు.
చంద్రుడికి సంబంధించిన కొన్ని విశేషాలు చంద్రుడి భమికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఉపగ్రహాం భూమి నుంచి చంద్రుని సగటు దూరం 3,84,790 కి.మీ. చంద్రుని వ్యాసం 3,476 మీ. అంటే భూమి వ్యాసంలో నాలుగోవంతు.
చంద్రుడు తన చూట్టూ తాను ఒక సారి తిరిగేందుకు 27.32 రోజులు పడుతుంది. చంద్రుని ఉపరితలం చూస్తే గచ్చకాయరంగుతో వేర్వేరు ఛాయల్లో కనిపిస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణ వల్లే సముద్రంలో కెరటాలు, ఆటుపోట్లు ఏర్పడుతున్నాయి. చంద్రుని మీద వాతావరణం లేదు.భూమి మీదున్న మనకు నీలంగా కనిపించే ఆకాశం చంద్రుడి మీద నిలబడి చూస్తే నల్లగా కనిపిస్తుంది. చంద్రుడి మీద వాతావరణమే లేదు కాబట్టి గాలి దుమారాలుగాని, వర్షం కాని ఉండదు. శబ్దం వినిపించదు. జీవరాశి ఉండదు. మిట్టమధ్యాహ్నం అంటే సూర్యుడు నిటారుగా పైన ఉన్నప్పుడు ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే నీరు మరిగే ఉష్ణోగ్రత అన్నమాట.
అర్థరాత్రి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 11 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఇంత తేడా ఉండడానికి చంద్రునిపై వాతావరణం లేకపోవడమే కారణం.
సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో మనం ఆకాశంలో గమనించే అందమైన రంగులు చంద్రుని మీద అగుపించవు.
ఈ కారణాల వల్ల చంద్రుని మీదికి యాత్రకు వెళ్ళే వ్యోమగామికి పీల్చేందుకు గాలి ఉండదు. పైగా విపరీతమైన ఉష్ణోగ్రత పరిస్థితులు తట్టుకోవాలి. అందుచేత ప్రత్యేకమైన రక్షణ అవసరం. ఇంతేకాకుండా, అనుక్షణం విశ్వకిరణాలు, అల్ట్రావయొలెట్ కిరణాల తాకిడి నుంచి కూడా రక్షణ అవసరం. ఎందుకంటే భూమ్మిద ఉన్న మనకు ఇక్కడి వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రం సహజ సిద్ధంగానే ఈ రక్షణ కల్పిస్తాయి.చంద్రుడి మీద ఈ రకమైన రక్షణ లభించదు.
చంద్రుని గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే 1/6 వ వంతు ఉంటుంది. అందుచేతనే ఏ వస్తువు బరువైనా ఆరోవంతుకు తగ్గిపోతుంది అంటే భూమ్మీద 60 కేజీల బరువుండే మనిషి చంద్రుని మీద 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
 చంద్రుడి మీద నిలబడి చూస్తే భూమి ఎలా అగుపడుతుంది. మనకు కనిపించే పున్నమినాటి చంద్రబింబం కంటే రెండున్నర రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది. ముప్పైరెట్లు ఎక్కువ కాంతిని వెదజల్లుతుంది. మేఘాలు తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తాయి. సముద్రం ముదురునీలం రంగులోను, ఖండాలన్నీ పర్పుల్‌బ్రౌన్  రంగులోను కనిపిస్తాయి.
భూమి మీద ఉన్నవారు సూర్యగ్రహణం చూస్తున్న సమయంలో చంద్రుడి మీద మనిషి ' భూగ్రహణం ' పరిశీలిస్తాడు చంద్రకళల మాదిరి మార్పులను కూడా భూమిని చంద్రుడి నుంచి చూస్తే గమనించవచ్చు.
సైన్సు టెక్నాలజీ శరవేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనదేశం కూడా ఈ రంగాల్లో తన కృషిని కొనసాగించవలసిందే. అయినా అధిక జనాభా, పేదరికం, అనారోగ్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి కొన్ని మౌలిక సమస్యలు మనల్ని పట్టిపీడిస్తున్నాయి. మనకు అందుబాటులో ఉన్న వనరులను ఈ సమస్యల పరిష్కారానికి వినియోగించవలసిన పరిస్థితుల్లో, కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్న అంతరిక్ష ప్రయోగాల ప్రాధాన్యత ఎంతమేరకు ఉండాలో ఆలోచించుకోవడం అవసరం

కేవలం మానవరహిత నౌకల్నేకాకుండా వ్యోమగాముల్ని కూడా చంద్రుడి మీదికి పంపిచేందుకు మనదేశం, చైనా ఆలోచిస్తున్నాయి. చంద్రుని నుంచి శిలలు, మట్టి నమూనాలు భూమికి తెప్ప